Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఓటమిని కోట్లమంది తమదిగా తీసుకున్నారు.. దాన్ని మర్చిపోండి: మోదీ

భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను దక్కించుకోలేదేమో కానీ వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకుందని ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వారు తనని కలిసినప్పుడు ఫైనల్‌ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగమని సూచించినట్టు చెప్పార

Webdunia
సోమవారం, 31 జులై 2017 (07:24 IST)
భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను దక్కించుకోలేదేమో కానీ వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకుందని ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వారు తనని కలిసినప్పుడు ఫైనల్‌ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగమని సూచించినట్టు చెప్పారు. 
 
‘మీరు ప్రపంచకప్‌లో విజేతలుగా నిలవలేకపోయామనే ఆలోచనను మనస్సులోంచి తుడిచేయండి. కప్‌ను గెలిచారా లేదా అనేది అప్రస్తుతం. కానీ భారతీయుల మనస్సులను గెలిచారు. వారు నన్ను కలిసినప్పుడు అందరి ముఖాల్లో కాస్త నిరాశ, ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించింది. నేను వారికి ఒకటే చెప్పాను. 
 
ఇది మీడియా యుగం. విపరీతమైన అంచనాలతో బరిలోకి దిగి ఫలితం రాకపోతే ఇలా నిరాశ, బాధ అలుముకుంటాయి. అయితే తొలిసారిగా వారి ఓటమిని కోట్లాది మంది దేశ ప్రజలు తమదిగా తీసుకుని వారి బరువును తగ్గించారు. ఈ పరాజయాన్ని మరిచి ముందుకు సాగండి’ అని ప్రధాని పేర్కొన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments