Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి వివాహం చేసిన పెళ్లీడుకొచ్చిన కుమార్తె .. ఎక్కడ? ఎలా?

సాధారణంగా తమ బిడ్డలకు తల్లిదండ్రులు వివాహాలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ తల్లికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె వివాహం చేసింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌ నగరంలో వెలుగు చూసిన పెళ్లి కథను తెలుసుకుందాం.

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (12:11 IST)
సాధారణంగా తమ బిడ్డలకు తల్లిదండ్రులు వివాహాలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ తల్లికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె వివాహం చేసింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌ నగరంలో వెలుగు చూసిన పెళ్లి కథను తెలుసుకుందాం.
 
జైపూర్ నగరంలో గీతా అగర్వాల్ (53) పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమె భర్త ముకేష్ గుప్తా. వీరికి సంహిత అనే కుమార్తె ఉంది. అయితే, గత 2016 మే నెలలో ముకేష్ గుప్తా గుండెపోటుతో మరణించాడు. దీంతో గీతా విషాదంలో మునిగిపోయింది. తండ్రి ఆకస్మిక మరణంతో వితంతువుగా మారిన తల్లి నిరాశ చెందడం చూసిన కుమార్తె జీర్ణించుకోలేక పోయింది. 
 
ఎలాగైనా తన తల్లిని మామూలు మనిషిని చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తల్లి ప్రొఫైల్‌ను తయారు చేసి దానిలో తన ఫోన్ నంబరు ఇచ్చి రెండోపెళ్లికి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన చూసిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. ఆయనకు భార్య కేన్సర్‌తో మరణించింది. పైగా, రెవెన్యూ ఇన్‌స్పెక్టరు. పేరు కేజీగుప్తా. 
 
వీరిద్దరి పెళ్లికి గీతా అగర్వాల్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరూ వ్యతిరేకించారు. అయినా సంహిత మాత్రం పెళ్లి పెద్దగా మారి తల్లికి గుప్తాతో రెండో పెళ్లి చేసింది. పెళ్లికి ముందే తల్లికి గర్భాశయాన్ని తొలగిస్తూ శస్త్రచికిత్స చేయించి పెళ్లి జరిపించింది. రెండో పెళ్లి అనంతరం తల్లి ముఖంలో విరిసిన చిరునవ్వు చూసి కుమార్తె సంహిత ఆనందానికి అవధుల్లేకండా పోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments