Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను హత్యచేసింది.. వంటింట్లో పాతిపెట్టి ఎప్పటిలాగానే హాయిగా వంట చేసుకుని?

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (16:44 IST)
సామాజిక మాధ్యమాల ప్రభావం, స్మార్ట్ ఫోన్ల వ్యవహారంతో మానవులు ఉన్మాదులుగా మారిపోతున్నారు. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ మహిళ భర్తను పొట్టనబెట్టుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అఘాయిత్యానికి పాల్పడింది.

కట్టుకున్న భర్తను దారుణంగా చంపిన ఆమె వంటగదిలోనే పాతి పెట్టి ఎప్పటిలాగే వంటచేసుకుంటూ జీవిస్తున్న మహిళను మధ్యప్రదేశ్ పోలీసులు నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... అనుప్పూర్ జిల్లాలోని కరోండి గ్రామానికి చెందిన మహేష్ బన్వాల్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రమీళతో ఆమెకు ఇటీవలే వివాహం అయ్యింది. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి. 
 
ఈ క్రమంలోనే మహేష్ సోదరుడు గంగారంతో ప్రమీలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వీరి అక్రమ సంబంధానికి మహేష్ బన్వాల్ అడ్డు వస్తున్నాడని అతని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతే మహేష్‌ను అక్టోబర్ 22వ తేదీన చంపేశారు. ఇంకా భర్త కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా నివ్వెర పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ప్రమీలపై మహేష్ సోదరుడు అర్జున్ బన్వాల్‌కి అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రమీల ఇంటిని తనిఖీ చేస్తున్నసమయంలో, వంటగదిలోంచి దుర్వాసన రావడంతో అనుమానంతో అక్కడ తవ్విచూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహేశ్ శవాన్నిగుర్తించి వెలికి తీశారు.

అనంతరం ప్రమీళ, గంగారం వద్ద జరిపిన విచారణలో మహేష్‌ను హత్య చేసి వంటింట్లోనే పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. నెలపాటు వంటింట్లో భర్త శవాన్ని పాతిపెట్టి అక్కడే వంట వండుకుని తినినట్లు ప్రమీళ పోలీసులతో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments