Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు స్వగ్రామం సైఫాయిలో ములాయం సింగ్ అంత్యక్రియలు

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:52 IST)
అనారోగ్యం కారణంగా అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామం సైఫాయి గ్రామంలో జరుగనున్నాయి. ఇందుకోసం ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తరలించారు. 
 
తమ అభిమాన నేత పార్థివదేహాన్ని చూసేందుకు ఆ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సైఫాయి గ్రామం నేతాజీ అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. 
 
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన... సోమవారం మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెల్సిందే. సోమవారం సాయంత్రానికి ఆయన పార్థివదేహాన్ని నేరుగా సైఫాయ్ గ్రామానికి తరలించారు. 
 
సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇందులో దేశంలోని నలుమూలల నుంచి అనేక మంది రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ అంత్యక్రియలు జరుగనుండగా, ఇందుకోసం యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 
 
కాగా, అంత్యక్రియల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి సోమవారం ములాయం పార్థివదేహానికి నివాళులర్పించారు. అఖిలేష్ యాదవ్‌కు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. 
 
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్​, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘెల్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఇవ్వాల నివాళులర్పించేందుకు రానున్నారు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మాజీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్.. ఇతర కుటుంబ సభ్యులు సైఫాయ్ గ్రామంలోనే ఉన్నారు.
 
ములాయం సింగ్ యాదవ్‌కు నివాళులు అర్పించేందుకు వీవీఐపీలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామానికి చేరుకోవడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం రాత్రి 9:30 గంటల వరకు సుమారు 10,000 మంది ప్రజలు తుది నివాళులు అర్పించారు. 
 
మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మూడు రోజులపాటు సంతాపదినాలుగా సెలవు ప్రకటించింది. ములాయం సింగ్ యాదవ్ (82) దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం 8:16 గంటలకు మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments