Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణం కావాలా? అయితే, ష్యూరిటీగా నగ్న ఫోటోలు ఇవ్వాలి... ఏ కంపెనీలో?

సాధారణంగా రుణం కావాలంటే ఏదేని సెక్యూరిటీ (ష్యూరిటీ) ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉద్యోగి పూచీకత్తు కావొచ్చు లేదా ఆస్తి తనాఖా కావొచ్చు. కానీ, ఆ కంపెనీ మాత్రం రుణగ్రహీతల నుంచి సెక్యూరిటీగా వారి నగ్న ఫోటోలను ష

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (08:55 IST)
సాధారణంగా రుణం కావాలంటే ఏదేని సెక్యూరిటీ (ష్యూరిటీ) ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉద్యోగి పూచీకత్తు కావొచ్చు లేదా ఆస్తి తనాఖా కావొచ్చు. కానీ, ఆ కంపెనీ మాత్రం రుణగ్రహీతల నుంచి సెక్యూరిటీగా వారి నగ్న ఫోటోలను ష్యూరిటీగా కోరుతోంది. ఇంతకీ ఈ సంస్థ పేరు ఏంటో తెలుసా? రెకాన్ ఎంటర్‌ప్రైజెస్. మహారాష్ట్రలోని థాణె కేంద్రంగా బీపీవో సేవలు అందిస్తోంది. 
 
ఈ సంస్థపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ సంస్థ కార్యాలయంపై గడచిన రెండు రోజులుగా దాడులు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని షాక్ కు గురయ్యారు. రెకాన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రుణాలు ఇస్తుంటుంది. అయితే 1,000 నుంచి 5000 డాలర్ల మధ్య వివిధ రకాల రుణాలిప్పించేందుకు 20 నుంచి 30 శాతం కమీషన్‌ తీసుకునేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. 
 
అంతేకాకుండా, లోన్‌కు ష్యూరిటీ అంటూ పలు పత్రాలతో పాటు నగ్న ఫోటోలు, వీడియోలు పంపాలని వినియోగదారులను డిమాండ్ చేశారు. అయితే రుణం అవసరమైన పలువురు వినియోగదారులు అలా ఫోటోలు, వీడియోలు పంపడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు వాటిని చూసి, షాక్ తిన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఆ సంస్థపై కేసులు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం