Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లితో అక్రమం సంబంధం : వ్యక్తిని హతమార్చిన సోదరులు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:00 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. పెళ్లీడుకొచ్చిన తమ చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అక్కసుతో ఇద్దరు సోదరులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాగపూర్ నగరంలోని కపిల్ నగర్ గడ్డిగోడం ప్రాంతానికి చెందిన కమలేష్ బందు సహారే అనే వ్యక్తికి వివాహమైంది. కానీ, ఆయన్ను భార్య వదిలేసింది. దీంతో కమలేష్ కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో మహదా కాలనీలోని టీనేజ్ యువతితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమం సంబంధానికి దారితీసింది. తనతో పలికే అమ్మాయికి కమలేష్ మొబైల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చాడు. తల్లిదండ్రులు వివాహితుడితో సంబంధం పెట్టుకోవడం తెలిసి మందలించారు. 
 
ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా కమలేశ్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. రెండు వారాల పాటు జైలులో ఉన్న కమలేశ్ విడుదలై, ఆ యువతితో మాట్లాడసాగాడు. 
 
దీంతో ఆగ్రహించిన బాలిక సోదరులిద్దరూ వారి స్నేహితులతో కలిసి కమలేశ్‌ను పట్టుకొని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు బాలిక సోదరులపై ఐపీసీ సెక్షన్ 302, 34 ప్రకారం కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments