Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమాజ్ రోడ్లపై చేయకండి... హర్యానా సీఎం ఖట్టర్

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి హర్యానా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. ఈయన తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సోదరులు చేసే పవిత్ర నమాజ్‌(ప్రార్థన)పై ఈ వ్యాఖ్య

Webdunia
ఆదివారం, 6 మే 2018 (13:07 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి హర్యానా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. ఈయన తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సోదరులు చేసే పవిత్ర నమాజ్‌(ప్రార్థన)పై ఈ వ్యాఖ్యలు చేశారు. నమాజ్ మసీదులు, ఈద్గాల్లో చదవండి.. రోడ్లపై కాదంటూ వ్యాఖ్యానించారు.
 
హర్యానాలో నమాజ్‌కు పదేపదే అడ్డంకులు ఎదురవుతుండటంపై స్పందిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించడం తమ బాధ్యత అని చెప్పారు. నమాజ్‌ను బహిరంగంగా చదవడం చాలా ఎక్కువైపోయింది. మసీదుల్లో చదివితే బాగుంటుంది అని ఖట్టర్ అన్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో కొన్ని అతివాద గ్రూపులు నమాజ్‌కు అడ్డు తగిలిన రెండు రోజులకే ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా మసీదులో కలిపేసుకోవాలని చూస్తున్నారంటూ రెండు వారాలుగా గురుగ్రామ్‌లో హిందుత్వ గ్రూపులు శుక్రవారం ప్రార్థనలకు అడ్డు తగులుతున్నాయి. మొన్న శుక్రవారం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రార్థనలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రార్థనలు జరుగుతున్న ప్రతిచోటుకి వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, హిందూ క్రాంతి దళ్, గోరక్షక్ దళ్, శివసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నతో మాట్లాడినా లింకులు పెట్టేస్తున్నారు.. రెండో పెళ్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు... జాను వీడియో

అనిరుధ్ సంగీతానికి అభిమాని అయిపోయా : విజయ్ దేవరకొండ

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments