Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో గన్ కల్చర్.. టీవీ జర్నలిస్ట్‌పై దుండగుల కాల్పులు

ఢిల్లీలో గన్ కల్చర్ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ టీవీ జర్నలిస్ట్‌పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలై

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:29 IST)
ఢిల్లీలో గన్ కల్చర్ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ టీవీ జర్నలిస్ట్‌పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన జర్నలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ''సహారా సమయ్''‌ అనే న్యూస్‌ ఛానల్‌లో అనుజ్‌ చౌదరీ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనాలపై వచ్చి అనుజ్‌ ఇంట్లోకి అడుగెట్టారు. ఆపై కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పుల్లో బాధితుడి పొట్ట.. కుడిచేతిలో బుల్లెట్లు దిగాయి. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనుజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. 
 
బీఎస్పీ కౌన్సిలర్ భర్త జర్నలిస్ట్ అనూజ్‌ చౌదరీ కావడంతో వ్యక్తిగత కక్షలతోనే ఈ దాడి జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో వున్న దుండగుల కోసం నాలుగు పోలీసు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments