Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం ఇస్తే ఏడేళ్ల జైలు శిక్ష... జాగ్రత్త...

కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టం-1988కి సవరణ చేసింది. ఇందుకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. సవరించిన ఈ చట్టం ప్రకారం లంచం ఇవ్వడం నేరమవుతుంది. అక్రమ మార్గాల

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (11:09 IST)
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టం-1988కి సవరణ చేసింది. ఇందుకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. సవరించిన ఈ చట్టం ప్రకారం లంచం ఇవ్వడం నేరమవుతుంది. అక్రమ మార్గాల్లో పనులు చక్కబెట్టుకునేందుకు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వటం, ప్రయోజనాల ఆశ చూపించటం, ఇస్తానని హామీ ఇవ్వటం కూడా నేరంగా పరిగణిస్తారు. ఇలా లంచం ఇచ్చిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదు. ఏడేళ్ల జైలుతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం వుంది.
 
లంచం ఇచ్చిన వారికే కాకుండా.. లంచం తీసుకున్న వారికీ శిక్షలుంటాయి. ప్రస్తుతం లంచం తీసుకున్న కేసుల్లో మూడేళ్ల వరకు శిక్ష ఉంటే.. కొత్త చట్ట సవరణ ప్రకారం వారికి కూడా ఏడేండ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఇప్పటివరకు ఉన్న ఏ చట్టాల్లోనూ లంచం ఇవ్వజూపే వ్యక్తులకు శిక్షలు లేవు. ఇప్పుడు ఈ చట్టం తీసుకురావటం వల్ల వారు కూడా నేరం చేసినట్లు అవుతుంది.
 
అయితే కొత్త చట్టంలో ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నేతలు, బ్యాంకర్లు, ఇతర సంస్థల అధికారులకు రక్షణ కల్పించారు. సంబంధిత సంస్థల ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, రాజకీయ నేతలు, బ్యాంకర్లను సీబీఐ, సీఐడీ వంటి దర్యాప్తు సంస్థలు విచారించలేవు. కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

తర్వాతి కథనం
Show comments