Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా పెళ్లైన కానిస్టేబుల్ లీవ్ లెటర్... మంచి మూడ్‌లో ఉన్నానంటూ..

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (14:19 IST)
కర్నాటక రాష్ట్రంలోని బేగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మారుతికి ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి కోసం ఎక్కువ రోజులే సెలవు తీసుకున్నప్పటికీ పెళ్లికి ముందు పెళ్లి పనులతో, పెళ్లయ్యాక బంధువులంతా ఉండటంతో వారితో గడపడంలో తీసుకున్న సెలవులన్నీ తెలీకుండానే త్వరగా గడిచిపోయాయి.


దీంతో మళ్లీ సెలవు పెట్టాలని నిర్ణయించుకున్న మారుతి పై అధికారికి లీవ్ లెటర్ రాసాడు. ఈ లెటర్‌ను ఎవరో ఫోటో తీసి నెట్‌లో పెట్టడంతో అది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
 
ఇంతకీ అందులో ఏముందంటే, తనకు ఇటీవల పెళ్లి జరిగిందని, భార్యతో కొన్ని పూజలు చేయాల్సి ఉందని, ఊరిలో కూడా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని లెటర్‌లో రాసాడు. అంతటితో ఆగకుండా… తనకు లేకలేక వివాహమైందని, ఆగలేకపోతున్నాననీ, మంచి మూడ్‌లో ఉన్నానని, తన పరిస్థితి అర్థం చేసుకొని 10 రోజులు సెలవు ఇవ్వాలని లేఖ రాశాడు.

ఈ లెటర్ చదివిన పై అధికారులు నవ్వుకోగా, ఉన్నదున్నట్లుగా చెప్పి సెలవు అడిగినందుకు కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుంటే, మరికొంత మంది సెలవు ఇచ్చేయడమే మంచిదంటూ సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments