Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాంటు విప్పి నర్సును పక్కలోకి పిలిచిన జమాత్ సభ్యుడు... ఎన్ఎస్ఏ ప్రయోగం

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో కరోనా బాధితులను ఉంచిన ఓ ఆస్పత్రికి పలువురు జమాత్ సభ్యులను తరలించారు. వారు నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.... ఇవి ఆరోపణలు కాదని, నిజంగానే నర్సుల పట్ల కరోనా లక్షణాలతో బాధపడుతున్న జమాత్ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారని తేల్చారు. దీంతో వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. 
 
ముఖ్యంగా పోలీసుల దర్యాప్తులో ఆస్పత్రిలోని కరోనా వార్డులో జమాత్ సభ్యులు ప్రవర్తించిన తీరు వెలుగులోకి వచ్చింది. క్వారంటైన్‌లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు జమాత్ సభ్యులు నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఆసుపత్రిలో అర్థనగ్నంగా తిరుగుతూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని పోలీసుల విచారణలో తేలింది. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ అనుమానితులు ఆసుపత్రిలో ఫ్యాంటు విప్పేసి.. నర్సులను పక్కలోకి రమ్మని పిలిచినట్టు ఓ నర్సు ఆరోపించింది. అలాగే, అసభ్యకరమైన పదజాలంతో పాటలు పాడుతూ, వికారమైన హావభావాలు ప్రదర్శించారని పోలీసుల దర్యాప్తులో బాధిత నర్సులు బోరున విలపిస్తూ చెప్పారు. ఈ కరోనా అనుమానితిలు మాత్రలు తీసుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత నర్సుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జమాత్ సభ్యులపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 269, 270, 271, 294, 354 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు నివేదికను జిల్లా మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు జమాత్ నిందితులపై ఘజియాబాద్ పోలీసులు కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆరుగురు జమాత్ సభ్యులను ఆసుపత్రి నుంచి ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments