Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారం.. పట్టపగలే..?

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (11:09 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. సోమవారం ఓ నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండిగల్ జిల్లా థేనిలో పట్టపగలే ఓ యువతిని కాలేజీ వద్దనే దుండగులు కిడ్నాప్ చేశారు. ఆపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని దిండిగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.
 
బాధితురాలి పరిస్థితి చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments