Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్డీకొట్టు మహిళను గొంతుకోసి చంపేశాడో దుర్మార్గుడు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (08:43 IST)
దేశరాజధాని ఢిల్లీ నగరంలో కూరగాయల బండి (బడ్డీకొట్టు) పెట్టుకొని జీవించే ఒక మహిళను గొంతుకోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం ద్వారకా ప్రాంతంలో జరిగింది. తొలుత సదరు మహిళ వద్దకు రావడానికి నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చీపురు చూపించి ఆ మహిళ అతన్ని బెదిరించింది.
 
ఆ తర్వాత తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. సంచిలో నుంచి కత్తి తీసి మహిళపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. ఈ హత్యోదంతం మొత్తం దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
అయితే అక్కడకు వెళ్లే సరికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని విభ (30)గా గుర్తించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చావబాదారు. తాగిన మైకంలో విభ, ఆమె భర్తతో అతను గొడవపడ్డాడని, ఆ కోపంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు.
 
సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు... నిందితుడి కోసం వెళ్లగా పోలీసులను కూడా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని కాపాడిన పోలీసులు స్థానికంగా ఉన్న దీన్‌దయాళ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు విధులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments