Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకు, కారు, ఫ్రిజ్, ఏసీ ఉందా? ఇక చేతికి చిప్పే... అన్నీ కట్

సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుని దేశప్రజల నడ్డివిరిస్తున్న మోడీ సర్కారు.. ఇపుడు తీసుకునే కఠ

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (08:53 IST)
సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుని దేశప్రజల నడ్డివిరిస్తున్న మోడీ సర్కారు.. ఇపుడు తీసుకునే కఠిన నిర్ణయం వల్ల ఇక ప్రభుత్వ రాయితీ అనేది ఎండమావికానుంది. నోట్ల రద్దు పేరుతో ఆర్నెల్ల పాటు ప్రజలను అష్టకష్టాలకు గురిచేసింది. ఇపుడు మరో నిర్ణయంతో షాక్‌కు గురిచేయనుంది. 
 
పట్టణాలు, నగరాల్లో నివాసముంటున్న వారికి కారు, ఫ్రిజ్, ఏసీ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు పొందేందుకు అర్హులు కాదంటూ కేంద్రం నియమించిన దేబ్రాయ్ కమిటీ బాంబులాంటి వార్త పేల్చింది. 
 
ముఖ్యంగా, నాలుగు గదుల ఇల్లున్నా, కారు లేదా ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ద్విచక్రవాహనం ఉంటే మీకు సర్కారు సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి అర్హులు కాదంటూ బిబేక్ దెబ్రాయ్ కమిటీ సిఫార్సు చేసింది. తాజాగా జరపనున్న సాంఘీక ఆర్థిక సర్వేలో పట్టణ వాసులకు పైన పేర్కొన్న వస్తువులు ఇంట్లో ఉంటే సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం చేసింది. 
 
ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments