Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారీరక సుఖం ఇస్తే.. పరీక్షల్లో సహకరిస్తా : విద్యార్థినికి టీచర్ చాటింగ్

ఠాగూర్
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (12:56 IST)
తనకు శారీరక సుఖం ఇస్తే పరీక్షల్లో సహకరిస్తానంటూ ఓ విద్యార్థిని పీఈటీ మాస్టర్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలోని స్టాటిష్ చర్చ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఈ కాలేజీకి విద్యార్థినులను ఇక్కడ పని చేసే పీఈటీ మాస్టర్ వేదించారు. దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులంతా ఆందోళనకు దిగడంతో దిగివచ్చి.. పీఈటీ మాస్టర్‌ను సస్పెండ్ చేసింది. 
 
కోల్‌కతాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ను సస్పెండ్ చేశారు. టీచర్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు క్యాంపస్‌లో గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థినిలను ఇలా వేధింపులకు గురిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి కాదని, గతంలో తమనూ ఇలానే వేధించాడంటూ ఆరోపించారు.
 
మరికొందరు విద్యార్థినిలు నిందితుడు సమీర్ రాయ్‌పై గతంలోనూ పలుమార్లు తాను కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధిత విద్యార్థిని ఆరోపించింది. దీంతో ఆందోళనకు దిగినట్టు పేర్కొంది. నిందితుడికి వ్యతిరేకంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తాజాగా స్పందించిన అధికారులు నిందితుడిని సస్పెండ్ చేశారు. నిందితుడిపై తదుపరి చర్యలు ఉంటాయని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
 
లైంగికంగా తనకు సహకరిస్తే చదువులో సాయం చేస్తానని బాధితురాలికి నిందితుడు వాట్సాప్‌లో సందేశాలు పంపించాడు. చదివిన తర్వాత వాటిని డిలీట్ చేయాలని కోరాడు. అంతేకాదు, ఆమెను దుస్తులు విప్పాలని కూడా కోరాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లు స్క్రీన్ షాట్స్‌ను బయటకు వచ్చాయి. 
 
అతడి మెసేజ్‌లకు ఒకసారి బాధిత విద్యార్థిని స్పందిస్తూ, మీ భార్య ఏం చేస్తుందని అడిగింది. అందుకు ఆయన సమాధానం ఇవ్వకుండా 'నువ్వు నాకు కావాలి' అని సమాధానం ఇచ్చాడు. 'నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?' అని కూడా అడిగాడు. అందుకామె బదులిస్తూ.. ఒక టీచర్‌గా మీరంటే తనకు ఇష్టమేనని, మీరు మంచివారని చెప్పింది. మరో మెసేజ్‌లో లైంగికంగా తనకు సహకరిస్తే బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)లో సహకరిస్తానని కూడా నిందితుడు ఆమెకు హామీ ఇవ్వడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం