Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదానికి గురైన ప్రధాని మోదీ సోదరుడి కారు.. ఎవరికి ఏమైంది?

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (22:11 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దామోదర్ దాస్ తన కుటుంబంతో సహా బెంగళూరు నుంచి పర్యాటక ప్రదేశమైన బండిపూర్ వైపు కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
డ్రైవర్ చక్రాలపై నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డెబ్బై ఏళ్ల దామోదర్ మోదీకి గాయమైంది. అతని కుమారుడు మెహుల్ ప్రహ్లాద్ మోదీ (40), కోడలు జిందాల్ మోదీ, వారి ఆరేళ్ల మనవడు మేనత్ మెహుల్ మోదీ కూడా గాయపడ్డారు. డ్రైవర్ కూడా గాయపడ్డాడు.
 
సరైన సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో, ప్రమాదం ప్రభావం తగ్గింది. ప్రయాణీకులు గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసు సూపరింటెండెంట్ సీమా లత్కర్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మైసూరు సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
 
గాయపడిన వారందరినీ జేఎస్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధు తెలిపారు. ప్రహ్లాద్ మోదీ మనవడు తలకు ఎడమ వైపున గాయాలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments