Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాకెట్‌లా పెరిగిన ప్రధాని మోడీ ఆస్తుల విలువ.. ఎలా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ తారాజువ్వలా పెరిగాయి. గత రెండేళ్ళ వ్యవధిలోనే ఆయన ఆస్తుల విలువ ఏకంగా 42 శాతం మేరకు పెరిగాయి. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయ వెబ్‌సైట్‌లో పేర్కొనడం జరిగింది.

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (10:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ తారాజువ్వలా పెరిగాయి. గత రెండేళ్ళ వ్యవధిలోనే ఆయన ఆస్తుల విలువ ఏకంగా 42 శాతం మేరకు పెరిగాయి. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయ వెబ్‌సైట్‌లో పేర్కొనడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల మేరకు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల విలువ 41.8 శాతం పెరిగి రూ.1.41 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పెరిగాయి. మరో కేంద్రమంత్రి సదానంద గౌడ ఆస్తులు 42.3 శాతం పెరిగి రూ.4.65 కోట్ల నుంచి రూ.6.62 కోట్లకు చేరుకున్నాయి.
 
అలాగే, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆస్తులు 2015-17 మధ్య భారీగా పెరగ్గా, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆస్తులు ఈ రెండేళ్ల కాలంలో కరిగిపోయాయి. కానీ, ఈయన సతీమణి ప్రచ్చి జవదేవకర్ ఆస్తుల విలువ మాత్రం ఏకంగా 190 శాతం మేరకు పెరగడం గమనార్హం. అంటే, నరేంద్ర సింగ్ తోమర్ ఆస్తులు 67.5 శాతం పెరిగి రూ.53 లక్షల నుంచి రూ.89 లక్షలకు చేరుకోగా, ప్రకాశ్ జవదేకర్ ఆస్తుల విలువ 50 శాతం తగ్గి రూ.1.11 కోట్ల నుంచి రూ.56 లక్షలకు చేరుకుంది. 
 
అలాగే, ఉక్కు మంత్రి చౌధరీ వీరేందర్ సింగ్ సంపద 23.5 శాతం పెరిగి రూ.7.97 కోట్ల నుంచి  రూ.9.85 కోట్లకు చేరుకోగా, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆస్తులు రూ.4.55 కోట్ల నుంచి రూ.5.34 కోట్లకు, వీకే సింగ్ ఆస్తులు రూ.69 లక్షల నుంచి రూ.78 లక్షలకు పెరిగాయి. పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు ఆస్తులు 11.7 శాతం పెరిగి రూ.6.98 కోట్ల నుంచి రూ.7.80 కోట్లకు చేరుకున్నాయి. 
 
ఇతర కేంద్ర మంత్రులైన రామ్ విలాస్ పాశ్వాన్ (30.8 శాతం), జేపీ నడ్డా (14.6 శాతం), అరుణ్ జైట్లీ (4.3 శాతం) ఆస్తులు కూడా క్షీణించాయి. కానీ పాశ్వాన్ ఆస్తుల్లో క్షీణత నమోదు కాగా వారి భార్యల ఆస్తులు మాత్రం రాకెట్ స్పీడ్‌తో పెరిగాయి. పాశ్వాన్ సతీమణి రీనా పాశ్వాన్ ఆస్తులు కూడా 14.9 శాతం పెరిగినట్టు ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments