Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వన్ ఎర్త్ - వన్ ఫ్యామిలీ - వన్ ఫ్యూచర్' : జీ20 లోగో ఆవిష్కరణ

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (08:17 IST)
"వన్ ఎర్త్ - వన్ ఫ్యామిలీ - వన్ ఫ్యూచర్‌" పేరుతో జీ20 లోగోను కేంద్రం ఆవష్కరించింది. వచ్చే నెలలో భారత్ జీ20 దేశాల ప్రెసిడెన్సీ (అధ్యక్షత)ని చేపట్టనుంది. దీన్ని పురస్కరించుకుని కేంద్రం ఓ లోగోను, థీమ్, వెబ్‌సైట్‌ను రూపొందించగా, దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆవిష్కరించారు. 
 
పైగా, డిసెంబరు ఒకటో తేదీ నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించనుండటం చారిత్రాత్మక ఘట్టమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుంది. ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ స్వీకరించనుంది. 
 
జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్‌లో 200 కీలక సమావేశాలు జరుగుతాయి. 32 విభిన్న రంగాలపై భారత్‌లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే యేడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది. 
 
ఈ నేపథ్యంలో జీ20 లోగోను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ, "వసుదైక కుటుంబం" అనేది భారత్ నివాదం అని ప్రపంచం పట్ల భారత్ సహృద్భావానికి ఈ నినాదం ఓ సంతకం వంటిదని మోడీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే దిశగా కమలం పువ్వు భారతదేశ విశ్వాసాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఆయన పేర్కొన్నారు. పైగా ఈ లోగోపై సూచనలు సలహాలు తెలియజేయాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments