Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైవేమీద కండోమ్స్.. సొరంగంలో వ్యభిచారం బాగోతం

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (16:09 IST)
కర్ణాటకలో ఇటీవల హైవేమీద కండోమ్స్ కుప్పలు తెప్పలుగా చెల్లాచెదురుగా పడిన వార్త వెలుగులోకి వచ్చింది. కర్నాటకలోని తుముకూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఇది జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. కండోమ్స్ కథపై కన్నేశారు. 
 
అవి అక్కడకు ఎలా వచ్చాయని ప్రత్యేక నిఘా పెట్టారు. విచారణలో సమీపంలో ఉన్న నంది డీలక్స్‌ లాడ్జి దగ్గర పోలీసులు ఆగిపోయారు. లోపలికి వెళ్లి షరామూమూలుగానే లాడ్జి సిబ్బందిని ప్రశ్నించారు. వాళ్లపై అనుమానం రావడంతో తమదైన స్టయిల్‌లో ప్రశ్నించారు. దీంతో లాడ్జీలో వయా టన్నెల్‌ డర్టీ పిక్చర్‌ బయటపడింది. 
 
పైకి నీట్‌గా కనిపిస్తున్న ఈలాడ్జీలో సొరంగంలో వ్యభిచారం బాగోతం బయటపడింది. దీంతో అడ్డుపెట్టిన టేబుల్ చక్కలను తొలగించి చూస్తే.. ఓ జంట మెల్లగా పాక్కుంటూ బయటపడింది. వారిద్దరితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాడ్జీలో వ్యభిచారం కోసం ఏకంగా సొరంగం తవ్వారు. ఆ మార్గంలో అమ్మాయిలను లాడ్జీలోకి తీసుకొచ్చి పక్కా దందా చేస్తున్నారు. 
 
ఇన్నాళ్లూ ఇదంతా గుట్టుగానే సాగింది. అయితే, వాడేసిన కండోమ్స్‌ పెరిగిపోవడంతో వాటన్నింటిని తీసుకొచ్చి రహదారిపై పడేశారు. ఎవరి పాపం వారికే చుట్టుకుంటుంది అన్నట్టుగా.. చేయి దులుపుకోవాలని చూసిన నిర్వాహకులు వాళ్లు చేసిన నిర్వాకంతో అడ్డంగా బుక్కయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments