Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ క్యాలెండర్‌లో ప్రియాంక చోప్రా ఫోటోలు కాకుండా ప్రియాంక వాద్రా ఫోటోలు పెట్టాలా?

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ అయిన.. మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా మళ్లీ వార్తల్లోకెక్కింది. తాజాగా అసోం టూరిజం క్యాలెండర్‌లో ప్రియాంక చోప్రా వస్త్రధారణ పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (14:54 IST)
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ అయిన.. మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా మళ్లీ వార్తల్లోకెక్కింది. తాజాగా అసోం టూరిజం క్యాలెండర్‌లో ప్రియాంక చోప్రా వస్త్రధారణ పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు కాలిపై కాలేసుకుని కూర్చుందని వివాదంలో ఇరుక్కున్న ప్రియాంక చోప్రా.. తాజాగా పీఎన్‌బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో కాంట్రాక్ట్‌ను ఆమె రద్దు చేసుకోవడం ద్వారా వార్తల్లోకెక్కింది. 
 
ప్రస్తుతం అస్సోం టూరిజం క్యాలెండర్‌లో ఆమె వస్త్రధారణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి విమర్శలు గుప్పించారు. అసోం సంస్కృతిని ప్రియాంక దిగజార్చారని.. ఆమెను రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ పోస్టు నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల విమర్శలను అసోం టూరిజం డెవలప్‌‍మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ జయంత మల్ల తిప్పికొట్టారు.
 
ప్రియాంక చోప్పా ఫోటోకు బదులు ప్రియాంక వాద్రా ఫోటోను పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారని జయంత మల్ల ఎద్దేవా చేశారు. అసోం టూరిజాన్ని అంతర్జాతీయంగా ప్రోత్సహించేందుకు ఈ క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రియాంక చోప్రాకు.. అంతర్జాతీయ గుర్తింపు వుండటంతోనే ఆమెను అసోం టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు జయంత వెల్లడించారు. కాంగ్రెస్ దిగజారుడు ప్రచారం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని జయంత ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments