Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి నిరాకరించిన సహజీవన ప్రియురాలు.. ప్రియుడు ఏం చేశాండంటే...

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (10:59 IST)
కొన్ని నెలల పాటు అతని ఆమె సహజీవనం చేసింది. ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసివుండి ముద్దూ ముచ్చట తీర్చుకున్నారు. దీంతో ఆమెపై అతనికి ప్రేమ మరింత ముదిరిపోయింది. ఫలితంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి, ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె నిర్మొహమాటంగా నో చెప్పింది. దీంతో ఆ ప్రియుడుకి ఏం చేయోలా అర్థంకాక పోస్టర్లు ముద్రించి ఊరంతా అంటించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణెకు చెందిన ఓ యువకుడు, ఓ యువతి కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఆ యువతిపై యువకుడు గాఢమైన ప్రేమను పెంచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పగా నిర్ద్వద్వంగా తోసిపుచ్చింది. 
 
దీంతో దిక్కుతోచని అతను పోస్టర్లు ముద్రించి ఊరంతా అంటించాడు. దీనిపై స్పందిస్తూ, నిజానికి తొలుత తామిద్దరం పెళ్ళి చేసుకోవాలని భావించే సహజీవనం చేశామన్నారు. కానీ, ఆమెకు డబ్బులు కావాలని, అందుకే ఆమె తనను విడిచిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటోందని వాపోయాడు. 
 
ఆ యువకుడు ఈ విషయమై రచ్చ చేయడంతో ఆ యువతితో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని గోడలు, స్తంభాలపై పోస్టర్లు అతికించిన ఉదంతం తెలుసుకున్న పోలీసులు వాటిని తొలగించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments