Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకను మింగిన కొండచిలువ.. కదల్లేక కష్టాలు పడింది.. చివరకు..?

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:48 IST)
వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కొండ చిలువను అటవీ శాఖ అధికారులు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. రామ్ పూర్ జిల్లాలోని సిహారి గ్రామంలో ఆదివారం నాడు ఓ భారీ కొండచిలువ కనిపించింది. అప్పుడే ఏదో జీవిని మింగినట్లుగా కనిపించగా.. కదల లేకుండా పోయింది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఈ కొండా చిలువ కనిపించింది.
 
సాధారణంగా తినే జంతువు కంటే మరేదో జంతువును మిగిందని స్థానికులు భావించారు. కనీసం కదలడానికి కూడా ఆ కొండ చిలువకు వీలు కాలేదు. ఆ కొండచిలువను చూస్తూ స్థానికులు కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. 
 
డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సిహారి గ్రామంలో ఆ కొండచిలువ కనిపించింది. మా టీమ్ కొండ చిలువను పరిశీలించి.. స్థానికంగా ఉన్న అడవిలో వదిలిపెట్టి వచ్చారు. ఆ కొండచిలువ మేకను మింగినట్లు ఉంది. అందుకే కదలలేకపోయిందని చెప్పారు. ఆ కొండ చిలువను ఓ ట్రాక్టర్‌లో వేసుకుని  తరలించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments