Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మతకలహాలకు బీజేపీ - ఎంఐఎం కుట్ర : రాజ్‌ థాక్రే

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:08 IST)
రామాలయం అంశాన్ని అడ్డుపెట్టుకుని భారతీయ జనతా పార్టీతో పాటు ఎంఐఎంలు దేశంలో మతకలహాలను సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే ఆరోపించారు. ముంబైలోని విఖ్రోలిలో జరిగిన ఆ పార్టీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మాట్లాడేందుకు ఒక్క అంశం కూడా లేదన్నారు. అందుకే మత అంశాలను తెరపైకి తెచ్చి, హిందూ - ముస్లిం ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. 
 
అయోధ్యలోని రామాలయం నిర్మాణం విషయంలో మజ్లిస్ పార్టీ, బీజేపీలు దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నుతున్నాయన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తాను కోరుతున్నాననీ, అదేసమయంలో నిర్మాణం విషయంలో అంత కఠినంగా వ్యవహరించబోనని చెప్పారు. 
 
ఇటీవల హనుమంతుడిని దళితుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను రాజ్‌‌థాకరే ఖండించారు. యూపీ, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికికాకుండా మహారాష్ట్రలోని స్థానికులకు ఉద్యోగాశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని రాజ్‌‌థాకరే డిమాండ్ చేశారు. వలస వచ్చిన వారి వల్ల మహారాష్ట్రలో స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని రాజ్‌‌ థాక్రే ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments