Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అల్లా' అనుగ్రహం కోసం కుమార్తెను బలిచ్చిన తండ్రి.. ఎక్కడ?

పవిత్ర రంజాన్ మాసంలో అల్లా కరుణాకటాక్షాల కోసం కన్నబిడ్డను చంపేశాడో కసాయి తండ్రి. ఈ దారుణానికి పాల్పడేముందు ఆ చిన్నారికి ఇష్టమైన అన్ని రకాల చిరుతిండ్లు తినిపించిమరీ పీకకోసి చంపేశాడు. తాజాగా వెలుగులోకి

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (11:24 IST)
పవిత్ర రంజాన్ మాసంలో అల్లా కరుణాకటాక్షాల కోసం కన్నబిడ్డను చంపేశాడో కసాయి తండ్రి. ఈ దారుణానికి పాల్పడేముందు ఆ చిన్నారికి ఇష్టమైన అన్ని రకాల చిరుతిండ్లు తినిపించిమరీ పీకకోసి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కుమార్తెను తీసుకుని మార్కెట్‌కు వెళ్లాడు. నువ్వంటే నాకెంతో ఇష్టమని ఊసులు చెప్పాడు. ఇష్టమైన మిఠాయిలు కొని తినిపించాడు. తండ్రి మాటలను నిజమేనని నమ్మేసిందా చిన్నారి. కానీ, తండ్రి చెబుతున్నవన్నీ అబద్ధాలని, తన ప్రాణం తీసేందుకు కుట్ర పన్నాడని తెలుసుకోలేకపోయింది. కుటుంబ సభ్యులు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
రాజస్థాన్‌ రాష్ట్రంలోని పైపర్ సిటీకి చెందిన నవావ్ అలీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్ష చేపట్టాడు. గురువారం సాయంత్రం పెద్ద కుమార్తె రిజ్వానా (4)ను మార్కెట్‌కు తీసుకెళ్లి ఆమెకు ఇష్టమైన స్వీట్లు కొనిపెట్టాడు. ఆ రాత్రి భార్య, పిల్లలతో కలిసి పై అంతస్తులో నిద్రపోయాడు. 
 
శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా రిజ్వానాను తీసుకుని కిందికి వచ్చాడు. ఖురాన్‌ను పఠిస్తూ కత్తితో కుమార్తె గొంతు కోసి చంపేశాడు. అనంతరం పైకెళ్లి నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత కిందికి వచ్చిన అలీ భార్య షాక్‌కు గురైంది. రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించింది. 
 
అంతా చూస్తున్న అలీ, రిజ్వానాను పిల్లి మెడకొరికి చంపేసి ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి చిన్నారిది హత్యగా నిర్ధారించారు. అలీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కాడు. అల్లా అనుగ్రహం కోసమే కుమార్తె‌ను బలిచ్చినట్టు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments