Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నచ్చలేదని.. తన స్నేహితులకు అమ్మేశాడు..

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (21:29 IST)
భార్య నచ్చలేదని.. తన స్నేహితులకు అమ్మేశాడు.. ఓ భర్త. వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ కోట ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ కోటకు సమీపంలోని బుండి ప్రాంతానికి చెందిన బాధిత మహిళ తండ్రి ఈ నెల 3వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. 
 
తన కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. తన కూతురిని విజయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన రాకేష్‌కు ఇచ్చి వివాహం చేశానని, అతడే తన కూతురిని వేరే వారికి అమ్మేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం ఆమెను కనుగొన్నారు.
 
తన భర్త రాకేష్, వదిన ప్రియ తనను తరచుగా హింసించేవారని బాధితురాలు వాపోయింది. ఈ నెల మూడో తేదీన తనను ముగ్గురు వ్యక్తులకు అమ్మేశారని బాధిత మహిళ చెప్పింది. వారు తనను ఓ ఇంట్లో నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్, ప్రియను అదుపు లోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల గురించి గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments