రెండు రేప్‌ కేసులు.. గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష.. ఏకకాలంలో అమలు కష్టం

అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్మీత్‌కు మరో పదేళ్లు జైలు శిక

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:08 IST)
అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్మీత్‌కు మరో పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజా ఉత్తర్వులు వెలువరించింది. రెండు వేర్వేరు కేసుల్లో మరో పదేళ్లు జైలు శిక్షను న్యాయమూర్తి ప్రకటించారు. 
 
గుర్మీత్ సింగ్‌పై 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారం, హత్య చేసినట్లు కేసు నమోదైంది. అయితే రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేసే అవకాశం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గుర్మీత్‌కు సుదీర్ఘకాలం శిక్ష విధించాలని సీబీఐ న్యాయమూర్తిని కోరింది. కానీ గుర్మీత్ చేసిన సమాజసేవని పరిగణలోకి తీసుకొని శిక్షను తగ్గించాలని గుర్మీత్ తరఫు న్యాయవాది జడ్జిని కోరారు.
 
ఇదిలా ఉంటే.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఒక్కో అత్యాచారం కేసులో పదేళ్ల శిక్షను మాత్రమే ఎందుకు విధించారు? యావజ్జీవ కఠిన కారాగార శిక్ష ఎందుకు విధించలేదు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా గుర్మీత్ 2002లో అత్యాచారానికి పాల్పడ్డాడు. 2005లో అతనిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతనిపై పోక్సో చట్టం వర్తించలేదు. దీంతో కేవలం పదేళ్ల జైలు శిక్ష, 15 లక్షల చొప్పున జరిమానాకు పరిమితమయ్యాడు. మొత్తంగా 20 ఏళ్ల జైలు శిక్ష, 30 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments