Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీ48 ఉపగ్రహ వాహకనౌకకు సర్వం సిద్ధం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (08:02 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ –సీ48 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. 
 
మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ (ఎంఎస్‌టీ)లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు శిఖర భాగాన శనివారం రీశాట్‌– 2బీఆర్‌1 అనే ఉపగ్రహంతోపాటు 9 విదేశీ ఉపగ్రహాలను అమర్చి హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేశారు. అనంతరం గ్లోబల్‌ చెకింగ్‌ చేస్తున్నారు. 
 
కొద్దిసేపట్లో  మిషన్‌ సంసిద్ధత సమావేశం (ఎంఆర్‌ఆర్‌) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఆర్‌ఆర్‌ అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డ్‌.. ల్యాబ్‌ సమావేశాన్ని నిర్వహించనుంది. సోమవారం ఉదయం లాంచ్‌ రిహార్సల్స్‌ నిర్వహించాక మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. 
 
26 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ –సీ48 రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా 628 కిలోల బరువు కలిగిన రీశాట్‌–2బీఆర్‌1, అమెరికాకు చెందిన తైవోక్‌–0129, ఐహోప్‌ శాట్, నాలుగు లీమూర్, జపాన్‌కు చెందిన క్యూఆర్‌ఎస్‌–సార్, ఇటలీకి చెందిన తైవోక్‌–0992, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫాట్‌–3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments