Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో అద్భుతం.. డ్రైవర్ లేని బైకుపై చిన్నారి.. 300 మీటర్ల జర్నీ!

బెంగళూరులో అద్భుతం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, చన్నపరమేశ్వర్, రేణుక దంపత

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (16:11 IST)
బెంగళూరులో అద్భుతం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, చన్నపరమేశ్వర్, రేణుక దంపతులు తమ ఐదేళ్ల చిన్నారితో కలసి బేగూరు నుంచి బెంగుళూరుకు బైక్‌పై వెళ్తున్నారు. వారికి ముందుగా వెళ్తున్న బైక్‌ను చిన్నారి తండ్రి వేగంగా ఢీకొట్టాడు. 
 
ఈ ఘటనలో దంపతులిద్దరూ బైకు నుంచి కింద పడిపోయారు. కానీ వారి బైకు మాత్రం కిందపడకుండా.. ముందు కూర్చున్న చిన్నారితో పాటు అదే వేగంతో రోడ్డుపై ప్రయాణించింది. ఇలా దాదాపు 300 మీటర్ల మేర ప్రమాదానికి గురైన బైకు ప్రయాణించింది. ఆ తర్వాత వేగం తగ్గడంతో బైకు రోడ్డుకు పక్కనే వున్న డివైడర్‌ను ఢీకొంది. దీంతో ఆ చిన్నారి పక్కనే వున్న గడ్డిలో పడ్డాడు. 
 
ఇంతలో బాటసారులు ఆ బిడ్డను పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకున్నారు. ఈ ఘటన మొత్తం వెనుకనే వస్తున్న ఓ కారు కెమెరాలో రికార్డ్ అయింది. ఆదివారం సాయంత్రం బెంగుళూరు రూరల్‌లోని నేలమంగళ ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులిద్దరికీ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను ఓ పోలీసు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments