Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడికి 15 రోజుల పాటు భార్యలను పంపండి.. రేప్ చేస్తారు: రూపా గంగూలీ సవాల్

బీజేపీ ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సాధారణమైంది. తాజాగా ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సీఎం మమతా బెనర్జీని, కాంగ్రెస్‌ను పొగుడుతున్న వార

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (17:20 IST)
బీజేపీ ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సాధారణమైంది. తాజాగా ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సీఎం మమతా బెనర్జీని, కాంగ్రెస్‌ను పొగుడుతున్న వారు తమ భార్యలను, అమ్మాయిలను, కోడళ్లను ఆ రాష్ట్రానికి 15 రోజుల పాటు పంపండన్నారు. 
 
అలా పశ్చిమబెంగాల్‌కు వెళ్ళి అక్కడే వుండి అత్యాచారానికి గురికాకుండా మహిళలు తిరిగి వస్తే తనకు చెప్పండంటూ రూపా గంగూలీ మీడియాతో అన్నారు. అదే గనుక జరిగితే.. పదిహేను రోజుల్లో పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళిన మహిళలు అత్యాచారానికి గురికాకుండా తిరిగి వస్తే తన ప్రకటనను ఉపసంహరించుకుంటానని సవాల్ విసిరారు.
 
'మహాభారత్' టీవీ సీరియల్‌లో ద్రౌపదిగా నటించి మంచిపేరు తెచ్చుకున్న రూపాగంగూలీ.. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందన్నారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం దాదాపు నెలరోజులుగా ఆందోళనలు, కల్లోలాలు చోటుచేసుకుంటున్నాయని రూపా గంగూలీ గుర్తు చేశారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments