Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళకు మంచం ఇవ్వాలా...? వద్దా...?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్ళిన శశికళ అక్కడ సాధారణ ఖైదీలా జీవితం గడుపుతున్నారు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న శశికళకు మంగళవారం సుప్రీంకోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష రూ.10 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జైల

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (22:08 IST)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్ళిన శశికళ అక్కడ సాధారణ ఖైదీలా జీవితం గడుపుతున్నారు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న శశికళకు మంగళవారం సుప్రీంకోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష రూ.10 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జైల్లో ప్రత్యేక సదుపాయాలు కావాలని శశికళ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో ఆమె బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో సాధారణ ఖైదీగా ఉంటున్నారు. 
 
రాత్రి తన సెల్‌లో ఆమె నేలపైనే పడుకున్నారని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఆమెకు మంచం ఇవ్వాలా, వద్దా అనే అంశంపై వైద్యులు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. శశికళతో పాటు ఆ సెల్‌లో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. శశితో పాటు జైలు శిక్షపడిన ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు జైలు అధికారులు వేర్వేరు సెల్స్ కేటాయించారు.
 
శశికళకు జైలులో ఈ రోజు ఉదయం అల్పాహారంగా పులిహోర, పచ్చడి పెట్టారు. శశికళ ఉదయం కాసేపు ధ్యానం చేస్తున్నారు. తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి తెలుసుకోవడానికి శశికళ చాలా ఆశక్తి చూపుతున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు జైలు సిబ్బందిని తమిళనాడులో ఏం జరుగుతుందో చెప్పాలని కోరుతోందట. నిన్న పళణిస్వామి సిఎంగా ప్రమాణం స్వీకారం చేశారని తెలియడంతో ఆనందంతో ఎగిరి గంతేసేంత పనిచేశారట శశికళ.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments