Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ జంటకు ఘోర అవమానం.. నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

ప్రేమ వివాహానికి ప్రస్తుతం అడ్డంకులు తొలగిపోతూ వస్తున్నాయి. మేజర్లు అయిన యువతీయువకులు ఒకరిని మరొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుంటే వారిని అడ్డుకునే హక్కు, శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదని న్యాయస్థానాల

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (10:14 IST)
ప్రేమ వివాహానికి ప్రస్తుతం అడ్డంకులు తొలగిపోతూ వస్తున్నాయి. మేజర్లు అయిన యువతీయువకులు ఒకరిని మరొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుంటే వారిని అడ్డుకునే హక్కు, శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదని న్యాయస్థానాలే తీర్పులిస్తున్న వేళ.. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారనే కారణంతో ఓ ప్రేమ జంటకు గ్రామస్తులు పెద్ద శిక్ష వేశారు.
 
ప్రేమికులను ఘోరంగా అవమానించారు. నగ్నంగా గ్రామ వీధులను తిప్పేలా చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌ ఉదయ్‌పూర్ పరిధిలోని చీర్వాకు చెందిన సెర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఒక ప్రేమ జంటను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. అక్కడ గుమిగూడిన జనమంతా దీన్ని వినోదంగానే చూశారు తప్ప.. ప్రేమ జంటకు ఎవ్వరూ సాయం చేయలేదు. పైగా ఈ ఘోరాన్ని వీడియో తీశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఒక గ్రామానికి చెందిన యువకుడు మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులు వారిద్దరికీ శిక్ష విధించారు. ఇద్దరినీ పట్టుకుని లోదుస్తులు తొలగించి తాళ్లతో కట్టేశారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ప్రేమ జంటను విడిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం