Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపి ఉద్యోగిని చంపేసిన యజమాని!

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (16:50 IST)
మలంద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపి ఉద్యోగిని యజమాని చంపేశాడు. ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక శివపురిలోని గోవర్ధన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శివపురి ఎస్‌ఐ రాజేశ్ సింగ్ చందేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగి 45 రోజులు గడిచింది. 
 
శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. అతడి మరణానికి సంబంధించి తమకు ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదని, అయితే విషయం ఈరోజే తెలియడంతో సంబంధింత అధికారిని దర్యాప్తు కోసం ఆదేశించామని తెలిపారు. 
 
కాగా, మరణించిన వ్యక్తి సోదరుడు దీనిపై మాట్లాడుతూ, ఈ సంఘటన నవంబరు 8న జరిగిందని, ఎప్పటిలానే తన సోదరుడు ఉద్యోగానికి వెళ్లాడని, అయితే మధ్యాహ్నానికి ఓ వ్యక్తి వచ్చి ‘మీ సోదరుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వెంటనే వెళ్లండి’ అని చెప్పారని, దాంతో హుటాహుటిన వెళ్లి అతడిని కలిసినట్లు చెప్పారు.
 
‘నేను వెళ్లేసరికి అతడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. విషయం అడగ్గా.. తాను పనిచేసే ఓనర్‌తో పాటు అక్కడ పనిచేసే మరికొంతమంది కలిసి తన మలద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపు చేశారని, దానివల్లే తాను కడుపునొప్పితో బాధపడుతున్నానని చెప్పాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా డాక్టర్లు చేతులెత్తేశారు. నొప్పి భరించలేక ఆ రోజే అతడు మరణించాడ’ని చెప్పాడు. దీనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments