Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఒంటరిపోరు.. బీజేపీ సర్కారు తథ్యం : అమిత్ షా

కర్ణాటక రాష్ట్ర శాసనసభకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సొంతంగానే సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్

Webdunia
ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (10:41 IST)
కర్ణాటక రాష్ట్ర శాసనసభకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సొంతంగానే సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 
 
మే 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఆయన గత రెండు రోజులుగా మైసూరులో మకాం వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటకాలో పొత్తుల్లేకుండానే పోటీచేసి తాము సొంతంగా అధికారంలోకి వస్తామన్నారు. కొన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ ఉందన్నారు. ప్రతి దగ్గర బీజేపీ మిగతా అన్ని పార్టీలకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. 
 
లింగాయత్‌లకు మైనారిటీ హోదాపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని… ఇన్నేళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ కూడా ముందే ఆ పని ఎందుకు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం లింగాయత్ ఓట్లను చీల్చేందుకు చేస్తున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. 
 
సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వ పాలన అవినీతిమయమైందన్నారు. దీంతో కర్ణాటక వాసులు విసిగిపోయారని, అభివృద్ధిని వారు కోరుకుంటున్నారన్నారు. నీటిని విడిచి చేప ఎలా ఉండలేదో అవినీతి లేకుండా కాంగ్రెస్ ఉండలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments