Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం భోజన పథకంలో పాము ... ఆరగించిన విద్యార్థుల అస్వస్థత

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (12:39 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మధ్యాహ్న భోజన పథకం ఒకటి. అయితే ఈ పథకం అమలులో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన. ఈ మధ్యాహ్న భోజనంలో వడ్డించే అన్నంలో పాము కనిపించి, ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అన్నాన్ని ఆరగించిన విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటన బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ బ్లాక్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం ఆరగించిన వారిలో దాదాపు 30 మందికి వరకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. విద్యార్థులకు వడ్డించిచన పప్పులో పాము కనిపించిందని సిబ్బంది పేర్కొన్నారు. 
 
ఈ ఆహారం తిన్న తర్వాత పిల్లులు అస్వస్థతకు గురైనట్టు పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు అందాయని బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి దీపాంజన్ జానా వెల్లడించారు. పిల్లలకు వాంతులు కావడంతో రామ్ పూర్ హట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ సంఘటనపై స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఘెరావ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments