ప్రియుడుతో అక్రమ సంబంధం ఉంది : అంగీకరించిన సోనమ్

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (09:00 IST)
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తు జరిగేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో వివాహేతర సంబంధం ఉన్న మాట నిజమేనని మృతుని భార్య సోనమ్ రఘువంశీ అంగీకరించారు. కొత్తగా పెళ్ళి చేసుకుని మేఘాలయ రాష్ట్రానికి హనీమూన్ కోసం వెళ్లిన దంపతుల్లో భారత్ రాజ్ రఘువంశీని భార్య సోనమ్, ఆమె ప్రియుడు, మరికొందరుకి కిరాయి ముఠా సభ్యులు కలిసి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ దారుణ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. 
 
ఈ హత్య కేసు పురోగతిని ఈస్ట్ ఖాసీ హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ నయీమ్ మీడియాకు వెల్లడించారు. తమ విచారణలో సోనమ్, రాజ్‌ ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారని తెలిపారు. పైగా, వారిద్దరికీ వివాహేతర సంబంధం ఉన్నట్టు వెల్లడించారని తెలిపారు. వారు ఇప్పటికే నేరాన్ని అంగీకరించారు. మేము నేరం జరిగిన తీరును పునఃసమీక్షించాం. వారు మాకు అంతా చూపించారు. మాకు తగిన ఆధారాలు లభించాయి. ఈ దశలో నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఎటువంటి ఆధారాలు లేనపుడు నార్కో టెస్ట్ చేస్తారు. పైగా నార్కో అనాలసిస్‌ను సుప్రీంకోర్టు ఖండించింది అని ఆయన గుర్తుచేశారు.
 
అయితే, హత్య వెనుక కారణాలు స్పష్టంగా చెప్పనప్పటికీ రాజాను మాత్రం తమదారి నుంచి తొలగించుకోవాలన్నదే వారి ప్రధాన లక్ష్యం. వారు రాజాను ఈ మొత్తం వ్యవహారం నుంచి బయటకు పంపాలనుకున్నారు. ఎందుకంటే వారి మధ్య వివాహేతర సంబంధం ఉంది. అందుకే ఈ వ్యక్తిని వదలించుకుంటే మంచిదని భావించి, ఈ దారుణానికి పాల్పడ్డారు అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments