Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియాకు ఏమైంది? ఐదు రోజులుగా ఆస్పత్రిలోనే.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి పాలయ్యారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆమె గత ఐదు రోజులుగా ఉంటున్నారు. ఫుడ్‌పాయిజనింగ్ కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో

Webdunia
గురువారం, 11 మే 2017 (15:54 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి పాలయ్యారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆమె గత ఐదు రోజులుగా ఉంటున్నారు. ఫుడ్‌పాయిజనింగ్ కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 
 
ఆమె ఆరోగ్య పరిస్థితిపై గురువారం గంగారామ్ ఆస్పత్రి ఛైర్మన్ డీఎస్ రానా మాట్లాడుతూ... "సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె చక్కగా కోలుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం..." అని పేర్కొన్నారు.
 
నిజానికి ఐదు రోజుల క్రితం కూడా డీఎస్ రానా ఇదే మాట చెప్పారు. పెద్ద సమస్య ఏం లేదనీ, ఫుడ్‌పాయిజనింగ్ అయిందని మరో 24 గంటల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కానీ, గురువారం కూడా ఇదే మాట మళ్ళీ చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అసలు పార్టీ అధినేత్రికి ఏమైందంటూ ఆరా తీయసాగారు. 
 
కాగా, 69 ఏళ్ల సోనియా గత కొంతకాలంగా పలు మార్లు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా గతేడాది ఆగస్టులో ఆమె అస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. వారణాసిలో రోడ్ షో సందర్భంగా ఆమె భుజానికి గాయమైంది. దీంతో ఆమె ఎడమచేతి భుజానికి సర్జరీ కూడా చేశారు. అనంతరం నవంబర్‌లో జ్వరం రావడంతో మళ్లీ రెండు రోజులు ఆస్పత్రిలో గడిపారు. ఆరోగ్య పరీక్షల కోసం ఇటీవల అమెరికా కూడా వెళ్లివచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments