గోవా శిర్గావ్ ఆలయంలో నిప్పులపై నడుస్తూ తోసుకున్న భక్తులు, ఏడుగురు మృతి

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (08:50 IST)
గోవాలోని శ్రిగావ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే శ్రీ లైరాయి దేవి జాతరలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను గోవా ప్రభుత్వ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మపుసాలోని నార్త్ గోవా జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. తొక్కిసలాటకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అలాగే, మృతులను కూడా గుర్తించాల్సివుంది. 
 
శ్రీ లైరాయి దేవి జాతరను ప్రతియేటా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు గోవా వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తుంటారు. లైరాయి దేవిని పార్వతీదేవి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. ఈ పండుగలో సంప్రదాయ ధోండాచిలో భాగంగా, వేలాది మంది భక్తులు పాదరక్షకులు లేకుండా మండుతున్న నిప్పులపై నడుస్తారు. ఈ వేడుకలో సంప్రదాయ డప్పుచప్పుళ్లు, భక్తిగీతాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments