Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్స్‌పై నిషేధం.. పిజ్జాకు బదులు చపాతీలు

మహారాష్ట్రలోని ఫడ్నవీస్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని అన్ని పాఠశాలల క్యాంటీన్లలో ఒబిసిటీకి దారితీసే జంక్ ఫుడ్స్‌ అమ్మకాలపై నిషేధం విధించింది. హై ఇన్ ఫ్యాన్, సాల్ట్ అండ్ షుగర్ ఆహారా

Webdunia
మంగళవారం, 9 మే 2017 (13:37 IST)
మహారాష్ట్రలోని ఫడ్నవీస్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని అన్ని పాఠశాలల క్యాంటీన్లలో ఒబిసిటీకి దారితీసే జంక్ ఫుడ్స్‌ అమ్మకాలపై నిషేధం విధించింది. హై ఇన్ ఫ్యాన్, సాల్ట్ అండ్ షుగర్ ఆహారాన్ని పాఠశాలల్లో అమ్మకుండా నిషేధం విధించింది.

జంక్ ఫుడ్స్‌లో తక్కువ స్థాయిలో విటమిన్స్, మినరల్స్ ఉండటమే కారణమని మహారాష్ట్ర సర్కారు తెలిపింది. దీంతో ప్రస్తుత క్యాంటీన్లలో అందుబాటులో ఉండే బర్గర్, పిజ్జా, ఫింగర్ చిప్స్, పఫ్‌ల స్థానంలో చపాతీలు అన్నం, రాజ్మా, గోధుమ ఉప్మా, కిచడీ, ఇడ్లీ, వడ, సాంబార్, జల్ జీరా, లెమన్ జ్యూస్ వంటివి అందుబాటులోకి తీసుకురావాలని మహారాష్ట్ర సర్కారు సూచించింది.  
 
ఇంకా జంక్ ఫుడ్‌కు అలవాటు పడిన విద్యార్థులు విద్యాభ్యాసంలో వెనుకబడిపోతున్నారని.. తామిచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు అన్ని స్కూళ్ల ప్రిన్సిపల్స్ చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి..? జంక్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఏర్పడే అనారోగ్య సమస్యలేంటి అనేదానిపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు తీసుకోవాలని మహారాష్ట్ర సర్కారు విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments