Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంకజా ముండేకు తలనొప్పి.. ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (16:32 IST)
మహారాష్ట్ర సర్కారుకు సుప్రీం కోర్టు పెద్ద షాకిచ్చింది. మహిళ, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖా మంత్రి పంకజా ముండే మంజూరు చేసిన రూ.6,300 కోట్ల ఆహార ఒప్పందాలను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కాంట్రాక్టులు 2016లో ఇవ్వడం జరిగింది. 
 
ఆంగన్ వాడీలలో పోషకాహారం అందించేందుకు ఈ కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ కాంట్రాక్టులు ఇచ్చేందుకు నియమాలను తుంగలో తొక్కినట్టు సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల డివిజన్ బెంచ్ ఫిబ్రవరి 26న ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
సుప్రీం కోర్టు తాజా తీర్పుతో రానున్న ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి తలనొప్పి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మహిళా పొదుపు సంఘాలను కాదని బడా కాంట్రాక్టర్లకు భారీ కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ నియమాలను ఉల్లంఘించటంతోనే ఈ కాంట్రాక్టులను రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments