Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మను అపస్మారక స్థితిలోనే ఆస్పత్రిలో చేర్చారట.. పెన్ డ్రైవ్‌లో?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయంలో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కీలకమైన పెన్ డ్రైవ్ లభ్యమైందని తెలుస్తోంది. వేదనిలయంలోని జయలలిత, శశికళ సహాయకుడు పూంగుండ్

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (14:41 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయంలో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కీలకమైన పెన్ డ్రైవ్ లభ్యమైందని తెలుస్తోంది. వేదనిలయంలోని జయలలిత, శశికళ సహాయకుడు పూంగుండ్రం గదుల్లో ఐటీ అధికారుల తనిఖీల్లో పెన్ డ్రైవ్‌ను లభ్యమైంది. ఆ పెన్ డ్రైవ్‌లో జయలలితను ఆస్పత్రి తరలించేందుకు గంటముందు గల విజువల్స్, ఆస్పత్రిలో చికిత్స సందర్భంగా గల విజువల్స్ వున్నాయని సమాచారం.  
 
జయలలిత మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలున్నాయి. తాజాగా లభించిన పెన్ డ్రైవ్ ద్వారా జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరే సమయంలో అపస్మారకస్థితిలో వున్నారని గతంలో ప్రచారం జరిగిన వార్తలకు బలాన్నిచ్చేలా వున్నాయి. ఇప్పటికీ ఈ పెన్ డ్రైవ్ ఐటీ అధికారుల వద్ద వున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. 
 
కాగా.. గత శుక్రవారం రాత్రి వేదనిలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడి సందర్భంగా ల్యాప్‌టాప్‌, టాబ్లెట్, కంప్యూటర్, ఆరు పెన్ డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత అమ్మ నివసించిన పోయెస్ గార్డెన్‌లో ఐటీ దాడులు తొలిసారి నిర్వహించారు. అంతకుముందు 1996లో డీఎంకే అధినేత ఎం కరుణానిధి సీఎం అయిన తరుణంలో వేదనిలయంలో ఇలాంటి దాడులు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments