Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అనుమానితుడు.. ప్రేయసి కోసం అలా పారిపోయాడు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (21:04 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలోనూ లాక్ డౌన్‌ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాట ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కరోనాలో భాగంగా ముందస్తు జాగ్రత్తలు నిర్వహిస్తున్నారు వైద్యులు. అలా మధురై ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొన్నిరోజుల కిందట దుబాయ్ నుంచి వచ్చాడు. కానీ కరోనా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో ఆ యువకుడ్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 
 
అప్పటికే ఆ యువకుడు శివగంగకు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే, క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఆ యువకుడు ప్రేయసిని వీడి వుండలేకపోయాడు. అంతే ప్రియురాలిని చూసేందుకు పరుగులు పెట్టాడు. 
 
ఇందులో భాగంగా క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయాడు. దాంతో వైద్య సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి అతడి కోసం గాలింపు చేపట్టారు. అలా ప్రియురాలి ఇంట్లో వున్న అతడిని గుర్తించారు. 
 
అతడు కరోనా అనుమానితుడు కావడంతో ఆయువతిని కలిసిన నేపథ్యంలో ఆమెకు కూడా కరోనా సోకుతుందేమోనన్న అనుమానంతో ఇద్దరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అంతేకాదు, క్వారంటైన్ నియమావళి ఉల్లంఘించాడంటూ ఈ యువకుడిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments