Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ...

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:09 IST)
తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ కన్నబిడ్డ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా చిన్నసేలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిన్న సేలం సమీపానగల నైనార్‌పాళయం గ్రామానికి చెందిన కవితాదేవి (41) అనే మహిళ భర్త వెంకటేశన్ ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. దీంతో కవితాదేవి తన 16 యేళ్ళ కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో కవితాదేవి అదే ప్రాంతానికి చెందిన గ్రామ సహాయకుడు రాజేంద్రన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ప్లస్ వన్ చదువుతున్న కుమార్తె భాగ్యలక్ష్మి కనిపెట్టి తల్లితో పాటు రాజేంద్రన్‌ను నిలదీసింది. 
 
దీంతో ఆగ్రహోద్రుక్తుడైన రాజేంద్రన్ భాగ్యలక్ష్మిని చెప్పుతో కొట్టాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని భాగ్యలక్ష్మి శనివారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కీళకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి కవితాదేవి, రాజేంద్రన్‌లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తల్లి వివాహేతర సంబంధం కారణంగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments