Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు కూతుళ్లు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారని ఆ తండ్రి ఏం చేశాడంటే?

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (21:50 IST)
64 ఏళ్ల మాయాండి తెంకాసి జిల్లాలోని పులియంగుడిలోని పెచి అమ్మన్ వీధిలో నివసిస్తున్నారు. చెట్లు ఎక్కి కొబ్బరి బొండాలు కొడుతూ వ్యాపారం చేస్తుండేవాడు. మాయాండికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
 
వీరిలో ఇద్దరు కుమార్తెలు ఇప్పటికే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు కూతుళ్లు తమకు ఇష్టంలేని పెళ్లిళ్లు చేసుకోవడంతో మాయాండి, అతని భార్య నిరాశకు గురయ్యారు. ఐతే పెళ్లి చేసుకున్నారు కదా అని వాళ్లనేమీ అనలేదు. ఐతే తమ మూడవ కుమార్తె విషయంలో మాత్రం నమ్మకం పెట్టుకున్నారు. తాము తెచ్చిన సంబంధాన్నే చేసుకుంటుందని అనుకున్నారు.
 
ఐతే మూడవ కుమార్తె కూడా ప్రేమలో పడింది. సమీప బంధువుతో ప్రేమలో పడటంతో ఆ సంబంధం వద్దని నచ్చజెప్పారు. కానీ కుమార్తె తండ్రి మాటలను పట్టించుకోలేదు. తను ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పేసింది. అంతేకాకుండా తన ప్రియుడితో లేచిపోయి అతడి ఇంట్లో మొన్న ఆగస్టు 28న వివాహం చేసుకుంది.
 
64 ఏళ్ల మాయాండి దీనిని అవమానంగా భావించాడు. దాంతో ఆగస్టు 31న పొలాలకు వేసే పురుగుమందులు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసి వెంటనే మాయాండిని బంధువులు తెన్కాసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తెలందరూ తమ మాట విననందునే తండ్రి ఈ పని చేశాడని స్థానికులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments