Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకు నా భార్యే కావాల్సివచ్చిందిరా...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (09:27 IST)
చెన్నైలో తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడుని ఓ భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అంతేనా.. భార్యను కూడా కత్తితో పొడిచాడు. ఈ ఏరియాలో ఇంత మంది మహిళలు ఉంటే.. నీకు నా భార్యే కావాల్సి వచ్చిందిరా అంటూ కత్తితో పదేపదే దాడి చేసి చంపేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై, తిరువొట్రియూరుకు చెందిన వనిత (25) అనే మహిళకు వివాహమై భర్త బాలాజీ, ఓ యేడాదిన్నర కుమారుడు. ఉన్నాడు. బాలాజీ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. 
 
అయితే, బాలాజీకి సమీప బంధువైన గణపతి (36) అనే వ్యక్తి తరచూ బాలాజీ ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో వనితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. 
 
ఈ క్రమంలో ఇటీవల వనిత - గణపతిలు లేచిపోయి, కాంచీపురం జిల్లాలోని పెరుంబేడులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివశించసాగారు. ఈ విషయం బాలాజీకి తెలిసింది. అంతే.. భార్య వనిత, ఆమె ప్రియుడు గణపతిలను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మంగళవారం తెల్లవారుజామున తన సహచరులతో కలిసి గుండు పెరుంబేడుకు వెళ్లాడు. 
 
భార్య, ప్రియుడు ఉంటున్న ఇంటిలోకి చొరబడి గణపతిని చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. అడ్డువచ్చిన భార్య వనితపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గణపతి అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం హంతకులు అక్కడి నుంచి పారిపోయారు. 
 
రాత్రిపూట అరుపులు విన్న ఇరుగుపొరుగు ప్రజలు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న వనితను చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేసి గణపతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments