Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలపై నాకు కట్టెయ్... నన్ను పట్టెయ్... అన్నను నెట్టి వధువుకు తాళికట్టిన తమ్ముడు...

విచిత్రం. వివాహం విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రం చోటుచేసుకుంది. అది కూడా తమిళనాడు రాష్ట్రం వేలూరులో. తన సొంత అన్నకు వివాహం జరుగుతుండగానే తమ్ముడు వధువు మెడలో తాళి కట్టేశాడు. అది కూడా సరిగ్గా అన్న తాళి కట్టే సమయానికి అన్నను పక్కకు నెట్టి వధువ

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (13:46 IST)
విచిత్రం. వివాహం విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రం చోటుచేసుకుంది. అది కూడా తమిళనాడు రాష్ట్రం వేలూరులో. తన సొంత అన్నకు వివాహం జరుగుతుండగానే తమ్ముడు వధువు మెడలో తాళి కట్టేశాడు. అది కూడా సరిగ్గా అన్న తాళి కట్టే సమయానికి అన్నను పక్కకు నెట్టి వధువుకు తాళి కట్టేశాడు. జరిగిన సంఘటనను చూసిన బంధువులు నివ్వెరపోయారు. అసలేం జరిగింది.
 
తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరు తెల్లరైపట్టికి చెందిన కామరాజుకు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆరు నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్‌కు మధురైకి చెందిన ఒక యువతితో వివాహం నిశ్చయం చేసుకొని అన్నీ మాట్లాడేసుకున్నారు. వివాహానికి ఏర్పాట్లు చేసేసుకున్నారు. గురువారం ఉదయం విలగంపట్టి ప్రాంతంలోని మురుగన్ ఆలయంలో వివాహ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
శుభ ముహూర్తం కూడా వచ్చేసింది. వధూవరులను పెళ్ళిపీటలపై కూర్చోబెట్టి పురోహితులు మంత్రాలు పూర్తి చేసి మంగళ సూత్రాన్ని వరుడి చేతికిచ్చి వధువు మెడలో కట్టమని చెప్పాడు. రాజేష్‌ పైకి లేచి తాళిబొట్టి కడుతున్నాడు..ఇంతలో ఒక్క ఉదుటన తమ్ముడు వినోద్ అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసుకుని వధువు మెడలో కట్టేశాడు.
 
దీన్ని చూసిన బంధువులు ఒక్కసారిగా నిలబడిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. కొద్ది సేపటికి తేరుకుని బంధుమిత్రులు, తల్లిదండ్రులు ఆగ్రహంతో వినోద్‌ను చితకబాదారు. ఆ తరువాత వినోద్‌ను వధువును విచారించగా రాజేష్‌కు పెళ్ళిచూపులు చూసే సమయంలోనే  వినోద్, వధువు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలుస్తోంది. ఆ తరువాత వీరి ప్రేమ కొనసాగుతూ వచ్చిందట. అయితే పెళ్ళి సమయంలో మాత్రం ఇలా చేద్దామని ముందే ఇద్దరూ అనుకుని ఇలా చేసినట్లు బంధువులకు తెలిపారు. ఇక చేసేది లేక బంధువులు పంచాయతీ పెట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments