Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో కంపెనీని కొనుగోలు చేయనున్న టాటా గ్రూపు

Webdunia
బుధవారం, 4 మే 2022 (12:20 IST)
పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా కంపెనీని కొనుగోలు చేసిన టాటా గ్రూపు ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్) కంపెనీని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత త్రైమాసికం చివరి నాటికి కంపెనీ ఎన్ఐఎల్ఎల్ కొనుగోలు పూర్తి చేయాలని టాటా స్టీల్ ఈసీఈ, మేనేజింగ్ డైరెక్టర్ టివి.నరేంద్రన్ తెలిపారు. ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా గ్రూపు రూ.18 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ఎన్ఐఎన్ఎల్‌ను సొంతం చేసుకునేలా ప్లాన్ చేసింది. ఒడిషా రాష్ట్రంలోని ఈ ఉక్కు తయారీ కర్మాగారంలో 93.71 శాతం వాటాను రూ.12100 కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ జనవరి 31వ తేదీన విన్నింగ్ బిడ్ ప్రకటించిన విషయం తెల్సిందే. కాగా, ప్రస్తుతం ఈ కంపెనీ రూ.6600 కోట్ల మేరకు బకాయిపడింది. దీంతో ప్రభుత్వం వదిలించుకునేందుకు ప్రయత్నించగా, దాన్ని టాటా గ్రూపు సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments