Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

ఐవీఆర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (18:29 IST)
జమ్మూ: కాశ్మీర్‌లోని వివిధ పట్టణాల్లో గుర్తించబడిన స్థానిక ఉగ్రవాదుల కుటుంబాలకు చెందిన దాదాపు పదికి పైగా బహుళ అంతస్తుల ఇళ్ళు పేలుడు పదార్థాల సహాయంతో కూల్చివేయబడ్డాయి. అయితే ఈ ఇళ్లలో ఉంచిన పేలుడు పదార్థాలు మూలంగా పేలిపోయాయని, భద్రతా దళాల పాత్ర ఇందులో లేదని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఉగ్రవాదులు లోపల పేలుడు పదార్థాలను ఉంచి ఇళ్లను ధ్వంసం చేసే ఈ ప్రక్రియ ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలియదు.
 
పహల్గామ్ ఊచకోత తర్వాత, భద్రతా దళాలు లోయలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. స్థానిక ఉగ్రవాదులు నివాసం వున్నట్లు గుర్తించి ఆ ఇళ్లను పేలుడు పదార్థాలతో పేల్చివేయడానికి కొత్త వ్యూహాన్ని అవలంభించాయి. భద్రతా సంస్థలు ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసిన 14 మంది స్థానిక ఉగ్రవాదులలో 12 మంది ఇళ్ళు ఇప్పటికే ధ్వంసమయ్యాయి.
 
అయితే, ఈ సిరీస్ ఆగిపోతుందని కాశ్మీరీలు అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ 14 తర్వాత బహుశా ఉగ్రవాదులకు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో మద్దతు ఇస్తున్న మరికొంతమంది ఇళ్ల వంతు కావచ్చునని సమాచారం. పహల్గామ్ దాడి తర్వాత ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకున్న 1500 మందిలో 22 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో ఈ ఇళ్లలో భారీగా ఉంచిన పేలుడు పదార్థాలు పేలడం వల్ల ఇవి జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments