Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాబిడ్డల్ని వదిలేశాడు.. ఓ బిడ్డ తల్లికి ఐ లవ్ యూ చెప్పాడు.. కాదనేసరికి?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (11:22 IST)
ప్రేమోన్మాదం పెరిగిపోతుంది. ప్రేమకు అంగీకరించకపోతే.. మహిళలపై దాడికి పాల్పడే దుండగుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా చెన్నై అరుంబాక్కంలో ఓ మహిళా ఉద్యోగికి ప్రేమకు అంగీకరించలేదని.. ఓ మేనేజర్ కత్తితో పొడిచేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, అరుంబాక్కం, రాణి అన్నానగర్ ప్రాంతానికి చెందిన శరణ్య (24). ఈమె కీల్పాక్కంలోని వున్న ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. అదే పార్లర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న విక్టర్ (41) అనే వ్యక్తి సరణ్యపై కన్నేశాడు. సరణ్యకు అప్పటికే వివాహం అయ్యింది. ఓ పాప కూడా వుంది. విక్టర్‌కు వివాహమై భార్యాపిల్లలున్నారు. 
 
కానీ వారి నుంచి విడిపోయిన విక్టర్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో విక్టర్ శరణ్యను ప్రేమిస్తున్నట్లు ప్రపోజల్ పెట్టాడు. ఇంకా తన ప్రేమను అంగీకరించాలని వేధించాడు. కానీ ఆమె విక్టర్ ప్రేమను నిరాకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తుండిన శరణ్య వద్ద తన ప్రేమను మరోసారి అంగీకరించాలని కోరాడు. 
 
అయితే శరణ్య విక్టర్‌తో ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తన చేతిలో వుంచుకున్న కత్తితో శరణ్యను పొడిచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గాయాలపాలైన శరణ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విక్టర్ కూడా అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments