Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థానీయులకు భారత్ ఆధార్ కార్డులు.. రూ.100 చెల్లించి మరీ...

కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డులు పాకిస్థానీయులు కూడా పొందుతున్నారు. అదీకూడా భారత్‌కు వచ్చిన రూ.100 చెల్లించి ఈ కార్డులను పొందడం ఈ కార్డుల జారీలో ఉన్న డొల్లతనం మరోమారు బహిర్గతమైంది. ఈ వివ

Webdunia
ఆదివారం, 28 మే 2017 (13:41 IST)
కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డులు పాకిస్థానీయులు కూడా పొందుతున్నారు. అదీకూడా భారత్‌కు వచ్చిన రూ.100 చెల్లించి ఈ కార్డులను పొందడం ఈ కార్డుల జారీలో ఉన్న డొల్లతనం మరోమారు బహిర్గతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఆధార్ నంబర్ల జారీ. అందరికీ విశిష్ట గుర్తింపును అందించాలన్న సదుద్దేశంతోనే 'ఆధార్' ప్రాజెక్టును చేపట్టింది. అయితే, ఈ ప్రాజెక్టు ఎంతగా దుర్వినియోగమవుతుందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణ. 
 
పాకిస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చిన ముగ్గురు యువకుల వద్ద, తాము భారత్ పౌరులమేనని చెబుతూ, ఆధార్ కార్డులు లభ్యంకాగా, దీనిపై విచారణ జరిపిన పోలీసులు అవాక్కయ్యే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. ఓ మధ్యవర్తికి రూ.300 (ఒక్కొక్కరికీ రూ.100 చొప్పున) చెల్లించిన వీరు మూడు ఆధార్ కార్డులను పొందారని తేల్చారు. 
 
దక్షిణ బెంగళూరు పరిధిలోని బాణశంకరి ప్రాంతానికి చెందిన ఓ మధ్యవర్తికి కరాచీ నుంచి వచ్చిన పాక్ పౌరులు కిర్హోన్ గులామ్ అలీ (26), ఖాసిఫ్ షంషుద్దీన్ (30), సమీరా అబ్దుల్ రెహమాన్ (25)లు ఈ డబ్బివ్వగా, వారికి అతను ఆధార్ కార్డులను సమకూర్చాడు.
 
కాగా, కిర్హోన్ ను ఖాసిఫ్ పెళ్లి చేసుకోగా, సమీరాను కేరళకు చెందిన షిహాబ్ వివాహం చేసుకున్నాడు. ఈ నలుగురూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. తమకు ఆధార్, ఓటర్ కార్డులను ఇచ్చేందుకు తొలుత రూ.500 డిమాండ్ చేశారని, అంత డబ్బు ఇచ్చుకోలేమని బతిమిలాడుకున్న తరువాత రూ.100కు వాటిని ఇచ్చాడని విచారణలో వీరు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం