Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన ప్రియుడిని అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించింది.. చంపేశాడు..

పెళ్లయ్యాక ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించిన యువతిని ఆమె మాజీ ప్రేమికుడు దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంకు సాయర్‌పురంలో

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (09:02 IST)
పెళ్లయ్యాక ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించిన యువతిని ఆమె మాజీ ప్రేమికుడు దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంకు సాయర్‌పురంలో నివసిస్తున్న ముత్తుమారి (21) చేపల ఎగుమతి కేంద్రంలో పని చేసేది. అక్కడే పనిచేసే తూత్తుకుడి వివేకానంద నగర్‌కు చెందిన మహరాజన్ (23)తో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 
 
మూడేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఫలితంగా ముత్తుమారి ప్రియుడితో సంబంధాలు తెంచుకుంది. దీంతో మహరాజన్ మరో యువతిని వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడు. ఈ నెల ఎనిమిదో తేదీన మహరాజన్‌కు ఫోన్ చేసిన ముత్తుమారి తామిరువురమూ కలిసి తీసుకున్న ఫోటోలను పోలీసులకు చూపెట్టి మానభంగం చేసినట్లు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని బెదిరించింది. ఉన్నట్టుండి మారిముత్తు తన ప్రేమికుడు మహరాజన్ ఇంటికి వెళ్లింది. 
 
మహరాజన్ తన భార్యకు మారిముత్తును తాను ప్రేమించిన విషయాన్ని తెలిపాడు. అయితే తన కాపురంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించిన ఆమెను విలాత్తికుళం తూత్తుకుడి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని పొదలమాటుకు తీసుకెళ్లి కత్తితో పొడిచి ఆమెను హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments